cooking oil: వంట నూనెల ధరల్లో ఊరట.. దిగుమతి సుంకాల తగ్గింపు

పండగల సీజన్‌లో వంట నూనెల ధరలు పెరగకుండా కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ...

Updated : 12 Sep 2021 11:02 IST

దిల్లీ: పండగల సీజన్‌లో వంట నూనెల ధరలు పెరగకుండా కట్టడి చేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచే ఇది అమలులోకి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 2.5శాతానికి, ముడి సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గింది. దీంతో దిగుమతి సుంకం సహా అన్ని రకాల పన్నులు కలిపి ఈ మూడు రకాల ముడి నూనెలపై 24.75శాతానికి, రిఫైన్డ్‌ ఆయిల్‌ రకాలపై 35.75 శాతానికి పరిమితం కానున్నాయి. వినియోగదారుల వద్దకు వచ్చే సరికి ఒక్కో లీటరు నూనె ధర రూ.4 నుంచి రూ.5 వరకు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వం దాదాపు రూ.1100 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని ఆర్థిక శాఖ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని