Corona: మందుబిళ్లతో కొవిడ్‌ తీవ్రతకు కళ్లెం!

కొవిడ్‌ చికిత్సారంగాన్ని కొత్త మలుపు తిప్పగల సరికొత్త ఔషధమొకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ జన్యు కోడ్‌లలో మార్పులు చేయడం....

Published : 04 Oct 2021 08:26 IST

త్వరలో అందుబాటులోకి సరికొత్త యాంటీవైరల్‌ ఔషధం

వాషింగ్టన్‌: కొవిడ్‌ చికిత్సారంగాన్ని కొత్త మలుపు తిప్పగల సరికొత్త ఔషధమొకటి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరస్‌ జన్యు కోడ్‌లలో మార్పులు చేయడం ద్వారా మహమ్మారి తీవ్రతకు కళ్లెం వేయగల యాంటీవైరల్‌ మందుబిళ్ల (మాత్ర)ను తాము అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన మెర్క్‌ అండ్‌ కో ఫార్మాసూటికల్‌ కంపెనీ తెలిపింది. ‘మాల్నుపిరవిర్‌’గా దానికి నామకరణం చేసినట్లు వెల్లడించింది. కొవిడ్‌ బారిన పడ్డవారు ఆస్పత్రి పాలయ్యే అవకాశాలను, మృత్యువాతపడే ముప్పును ఈ మాత్ర సగం మేరకు తగ్గిస్తుందని పేర్కొంది. దాని అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు కోరనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా సహా అన్నిరకాల కరోనా వైరస్‌లపై ఈ ఔషధం సమర్థంగా పనిచేస్తోందని వివరించింది. ‘మాల్నుపిరవిర్‌’ విపణిలో అందుబాటులోకి వస్తే.. కొవిడ్‌ వ్యాధికి నోటిద్వారా తీసుకునేందుకు వీలున్న (ఓరల్‌) తొలి యాంటీవైరల్‌ ఔషధం ఇదే అవుతుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని