Afghanistan: మాకే శిక్ష వేస్తారా.. అఫ్గాన్‌లో మహిళా జడ్జీల కోసం తాలిబన్ల వేట

గతంలో అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించిన మహిళలు.. ఇప్పుడు తాలిబన్ల పేరు చెబితేనే గజగజ వణికిపోతున్నారు. వారిలో కొందరు ఇప్పటికే దేశాన్ని వీడారు. అలా వెళ్లలేని వారు మాత్రం రోజూ

Published : 30 Sep 2021 08:05 IST

 

కాబుల్‌: గతంలో అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించిన మహిళలు.. ఇప్పుడు తాలిబన్ల పేరు చెబితేనే గజగజ వణికిపోతున్నారు. వారిలో కొందరు ఇప్పటికే దేశాన్ని వీడారు. అలా వెళ్లలేని వారు మాత్రం రోజూ ప్రాణ భయంతో.. రహస్య ప్రాంతాల్లో దాక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అఫ్గాన్‌ను గత నెలలో ఆక్రమించుకున్న వెంటనే తాలిబన్లు.. ఎంతోమంది నేరగాళ్లకు విముక్తి ప్రసాదించారు. వారిని జైళ్ల నుంచి విడుదల చేశారు. అలా విడుదలైన వారిలో దాదాపుగా అందరూ గతంలో తాలిబన్ల తరఫున పనిచేశారు. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన వీరికి శిక్ష విధించడమే మహిళా న్యాయమూర్తులు చేసిన పాపం. జైలు నుంచి విడుదలైన నేరస్థులు.. ప్రస్తుతం మహిళా న్యాయమూర్తుల కోసం గాలిస్తున్నారు. తమకు శిక్ష వేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో 220 మందికిపైగా మహిళా న్యాయమూర్తులు ప్రాణ భయంతో దాక్కున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని