The Challenge: అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన చిత్రబృందం

సినిమా చిత్రీకరణ నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) వెళ్లిన బృందం 12 రోజుల అనంతరం ఆదివారం విజయవంతంగా తిరిగొచ్చింది.

Updated : 18 Oct 2021 09:10 IST

మాస్కో: సినిమా చిత్రీకరణ నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) వెళ్లిన బృందం 12 రోజుల అనంతరం ఆదివారం విజయవంతంగా తిరిగొచ్చింది. ఐఎస్‌ఎస్‌ నుంచి వారిని తీసుకొచ్చిన స్పేస్‌ కాప్స్యూల్‌ భూవాతావరణంలోకి ప్రవేశించాక పారాచూట్‌ సాయంతో కజకిస్థాన్‌లోని గడ్డి మైదానాల్లో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. భూమికి తిరిగొచ్చిన నటి యులియా పెరెసిల్డ్‌, దర్శకుడు క్లిమ్‌ షిపెంకోలతో పాటు వ్యోమగామి ఒలెగ్‌ నొవిట్స్కీలను వైద్య శిబిరానికి తరలించారు. ఈ దృశ్యాలను కూడా సినిమా కోసం చిత్రీకరించారు.  అనంతరం వారికి జరిపిన పరీక్షల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు తేలింది. ‘ఛాలెంజ్‌’ సినిమా చిత్రీకరణ కోసం వీరంతా ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని