Corona: గాలి ద్వారా వ్యాపించేలా కరోనా రూపాంతరం

కరోనాలో కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్‌ బారినపడిన

Updated : 19 Sep 2021 09:58 IST

వాషింగ్టన్‌: కరోనాలో కొత్తగా వస్తున్న రకాలు గాలి ద్వారా సంక్రమించేలా క్రమంగా రూపాంతరం చెందుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వైరస్‌లోని ఆల్ఫా వేరియంట్‌ బారినపడిన వ్యక్తులు.. సాధారణ రకంతో పోలిస్తే 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరల్‌ రేణువులను గాల్లోకి వెదజల్లుతారని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖానికి సరిగా అమరని వస్త్ర, సర్జికల్‌ మాస్కుల వల్ల కొవిడ్‌-19 వ్యాప్తి సగం మేర మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఆల్ఫా రకం కన్నా డెల్టా వేరియంట్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలో పాల్గొన్న డాన్‌ మిల్టన్‌ పేర్కొన్నారు. ‘‘కొత్త వేరియంట్లు క్రమంగా గాలిద్వారా ప్రయాణించే సామర్థ్యాన్ని మెరుగు పరచుకుంటున్నాయి. అందువల్ల గదుల్లో వెంటిలేషన్‌ బాగుండాలి. ముఖానికి సరిగా అమరే మాస్కులు ధరించాలి. దీనికితోడు టీకాలను పొందితే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని ఆయన తెలిపారు. కొత్త వేరియంట్ల వల్ల బాధితుల శరీరంలో వైరల్‌ లోడు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ఈ లోడును మించి.. గాల్లోకి సులువుగా వ్యాపించే సామర్థ్యం కూడా వాటివల్ల పెరుగుతోందని తమ పరిశోధనలో తేలినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని