Vaccine certificate: వాట్సప్‌లో టీకా ధ్రువపత్రం

కరోనా టీకా ధ్రువపత్రాలు ఇకపై క్షణాల్లో వాట్సప్‌ ద్వారా అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కాంటాక్టు నంబరు (+91 90131 51515) సేవ్‌ చేసుకొని

Updated : 09 Aug 2021 12:01 IST

దిల్లీ: కరోనా టీకా ధ్రువపత్రాలు ఇకపై క్షణాల్లో వాట్సప్‌ ద్వారా అందుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కాంటాక్టు నంబరు (+91 90131 51515) సేవ్‌ చేసుకొని, ‘కొవిడ్‌ సర్టిఫికెట్‌’ అనే సందేశం వాట్సప్‌లో పంపాలి. ఆ తర్వాత ఓటీపీ ఎంటర్‌ చేసి, క్షణాల్లో ధ్రువపత్రాలు పొందవచ్చు’’ అని మంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ‘‘ఈ విధానం చాలా సులభం..’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని