Vijay Mallya: విజయ్‌ మాల్యా దివాలాదారే.. లండన్‌ హైకోర్టు తీర్పు

భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Published : 27 Jul 2021 07:09 IST

లండన్‌: భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై చాలాకాలంగా న్యాయపోరాటం చేస్తున్న బ్యాంకులకు భారీ విజయం లభించింది. మాల్యా దివాలా తీసినట్లు లండన్‌ హైకోర్టు ప్రకటించింది. దీంతో ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు భారతీయ స్టేట్‌ బ్యాంకు నేతృత్వంలోని 13 బ్యాంకుల కన్సార్షియంకు మార్గం సుగమమైంది. మాల్యా అప్పగింత కేసును విచారించిన లండన్‌ హైకోర్టులోని ఛాన్సెరీ డివిజన్‌ చీఫ్‌ ఇన్సాల్వెన్సీస్‌ అండ్‌ కంపెనీస్‌ కోర్టు(ఐసీసీ) జడ్జి మైఖైల్‌ బ్రిగ్స్‌ సోమవారం తీర్పునిస్తూ దివాలా ఉత్తర్వు జారీ చేశారు. బకాయిలు చెల్లించగల స్థితిలో మాల్యా ఉన్నారనేందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఉత్తర్వుపై అపీలు దాఖలు చేసే అవకాశాన్నీ తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని