British High Commissioner: ఒక రోజు బ్రిటిష్ హైకమిషనర్ కావాలనుకుంటున్నారా?
అమ్మాయిలకు మాత్రమే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ఒక రోజు బ్రిటిష్ హైకమిషనర్‌గా వ్యవహరించాలని అనుకుంటున్నారా? అయితే, అమ్మాయిలూ పోటీకి సిద్ధం కండి. ‘ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులతో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడంలో యువత ఎలా తోడ్పాటును అందిస్తుంది’ అనే అంశంపై 18నుంచి 23సంవత్సరాల యువతులకు పోటీలు నిర్వహించాలని భారత్‌లోని బ్రిటిష్ హైకమిషన్ నిర్ణయించింది. ఆ పోటీలో గెలుపొందిన యువతి బ్రిటిష్ హైకమిషనర్‌గా ఒక రోజు సేవలు అందించేలా అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్లు హైకమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పోటీలో పాల్గొనదలచిన అమ్మాయిలు వీడియోను ట్విటర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లో #DayoftheGirlను ఉపయోగించి@UKIndia కు ట్యాగ్ చేయాలి. తమ అభిప్రాయాన్ని వీడియో రూపంలో ఈ నెల 22లోగా పంపాలని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ పేర్కొన్నారు. 2017 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, గతేడాది 18సంవత్సరాల చైతన్యావెంకటేశ్వరన్ గెలుపొంది ఒక రోజు హైకమిషనర్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: వరదలొచ్చి పనులాగితే మేమేం చేస్తాం!: మంత్రి అంబటి రాంబాబు
-
India News
PM Modi: నిరాశతో ‘చేతబడి’ని ఆశ్రయిస్తోంది.. కాంగ్రెస్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు
-
Movies News
Karthikeya 2: ఆ చిరు ప్రయత్నమే ‘కార్తికేయ 2’.. వారికీ ఈ చిత్రం అర్థమవుతుంది: చందు
-
India News
75th Independence Day: ఎర్రకోట వేడుకల్లో.. అత్యాధునిక తుపాకులతో ‘గన్ సెల్యూట్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ