Karnataka: కుప్పూరు గద్దుగె మఠాధిపతిగా బాలుడు

కర్ణాటకలోని కుప్పూరు గద్దుగె మఠాధిపతిగా తేజస్‌ కుమార్‌(13) అనే బాలుడు ఎంపికయ్యారు. తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి తాలూకాలో ఉన్న ఈ మఠానికి ఇప్పటివరకు

Updated : 28 Sep 2021 08:24 IST

బెంగళూరు, చిక్కనాయకనహళ్లి, న్యూస్‌టుడే: కర్ణాటకలోని కుప్పూరు గద్దుగె మఠాధిపతిగా తేజస్‌ కుమార్‌(13) అనే బాలుడు ఎంపికయ్యారు. తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి తాలూకాలో ఉన్న ఈ మఠానికి ఇప్పటివరకు అధిపతిగా ఉన్న యతీంద్ర శివాచార్య స్వామీజీ కొవిడ్‌ బారినపడి ఈనెల 25న కన్నుమూశారు. ఆయన మరణించే ముందు... తేజస్‌ను వారసునిగా ప్రకటించారు. మఠాధిపతికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు తప్పనిసరి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జె.సి.మాధుస్వామి, ఇతర మఠాల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో కొత్త మఠాధిపతి పేరు ప్రకటించారు. కొత్త మఠాధిపతి చేతుల మీదుగా యతీంద్ర శివాచార్య అంత్యక్రియలు జరిపించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న తేజస్‌ కుమార్‌ 2008, ఏప్రిల్‌ 22న జన్మించారు. మైసూరు సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని