Omicron: ఒమిక్రాన్‌ భయం.. భార్యాపిల్లలను హతమార్చిన వైద్యుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ‘ఒమిక్రాన్‌’ భయం నేపథ్యంలో సుశీల్‌కుమార్‌ అనే వైద్యుడు.. భార్యాపిల్లల్ని హతమార్చాడు. ‘‘మహమ్మారి వల్ల కలిగే సవాళ్ల నుంచి విడిపించడం సహా..

Published : 05 Dec 2021 07:07 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో ఒళ్లుగగుర్పొడిచే ఘటన వెలుగుచూసింది. ‘ఒమిక్రాన్‌’ భయం నేపథ్యంలో సుశీల్‌కుమార్‌ అనే వైద్యుడు.. భార్యాపిల్లల్ని హతమార్చాడు. ‘‘మహమ్మారి వల్ల కలిగే సవాళ్ల నుంచి విడిపించడం సహా.. వారి కష్టాలన్నింటినీ క్షణాల్లో తొలగించేందుకే ఇలా చేశాను’’ అని ఆయన లేఖ రాసిపెట్టడం గమనార్హం.  ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతిగా పని చేస్తున్న సుశీల్‌కుమార్‌ కల్యాణ్‌పుర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.  హత్యలకు పాల్పడిన సుశీల్‌.. వీటి గురించి పోలీసులకు తెలియజేయాలని కోరుతూ.. తన సోదరుడు సునీల్‌కు     ఫోన్‌లో ఓ సందేశం పంపాడు. దీంతో సునీల్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన పోలీసులు నిశ్చేష్టులయ్యారు. భార్య చంద్రప్రభ (48), శిఖర్‌ సింగ్‌ (18), కుమార్తె ఖుషీ సింగ్‌(16) మృతదేహాలు వేర్వేరు గదుల్లో రక్తపు మడుగులో విగతజీవిగా ఉండటాన్ని గమనించారు. సుశీల్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని