Kidnap: పాప కోసం హెలికాప్టర్లు, నౌకల్లో గాలించారు

నాలుగేళ్ల పాప ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన అన్వేషణ.. సుఖాంతమయింది. ‘మై నేమ్‌ ఈజ్‌ క్లియో’ అని ఆ చిన్నారి ధ్రువీకరించడంతో భద్రత బలగాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాయి. స్వయానా దేశ ప్రధాని

Updated : 04 Nov 2021 17:39 IST

  ఎట్టకేలకు అన్వేషణ ఫలించి.. కనిపించిన చిన్నారి

 18 రోజుల తర్వాత ఆ కుటుంబంలో ఆనందం

ఆస్ట్రేలియాలో అపూర్వ ఘటన

ఆసుపత్రిలో నవ్వులు చిందిస్తున్న క్లియో

సిడ్నీ: నాలుగేళ్ల పాప ఆచూకీ కోసం ఆస్ట్రేలియాలో జరిగిన అన్వేషణ.. సుఖాంతమయింది. ‘మై నేమ్‌ ఈజ్‌ క్లియో’ అని ఆ చిన్నారి ధ్రువీకరించడంతో భద్రత బలగాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యాయి. స్వయానా దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించడం విశేషం. జేక్‌ గిడ్డన్‌, ఎల్లీ స్మిత్‌ దంపతులు ఆస్ట్రేలియాలోని క్యూబా బ్లూహోల్స్‌ పర్యాటక ప్రాంతానికి తమ నాలుగేళ్ల గారాలపట్టి క్లియో స్మిత్‌తో కలిసి వెళ్లారు. సముద్ర తీరాన అడవికి దగ్గరలో ఉన్న ఆ ప్రాంతంలో బస చేశారు. నిద్రలేచి చూసే సరికి చిన్నారి కనపడలేదు. ఆచూకీ కనిపెట్టడానికి 100 మంది అధికారులే కాకుండా పెద్దఎత్తున వలంటీర్లు రంగంలోకి దిగారు. ఆమె తల్లిదండ్రుల బహిరంగ అభ్యర్థన ఆస్ట్రేలియాను కదిలించింది. దేశం మొత్తం ఆ పాప క్షేమం కోసం ప్రార్థించింది. పాప ఆచూకీ చెబితే 10 లక్షల డాలర్లు అందజేస్తామని ప్రభుత్వం గతవారం ప్రకటించింది. హెలికాప్టర్లు, నౌకలు కూడా గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. అత్యాధునిక సాంకేతికత సాయంతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ 18 రోజుల తర్వాత ఫలించింది. పాపను ఎవరో అపహరించి, ఓ ఇంట్లో ఉంచారని పోలీసులు గుర్తించారు. అనుమానితుడిని అరెస్ట్‌ చేసి, బాలికను రక్షించారు. బాలిక ఆచూకీ కోసం మానవ మేధస్సు, సాంకేతికత, సీసీ కెమెరాల దృశ్యాలు, ఫోరెన్సిక్‌ విశ్లేషణలు ఉపయోగపడ్డాయని అధికారులు తెలిపారు. పోలీసుల్ని ప్రధాని మారిసన్‌ అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని