
Published : 02 Dec 2021 09:37 IST
Gambling: జూదంలో భార్యను ఓడి.. ట్రిపుల్ తలాక్‌తో గెంటేసి..
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను దిల్లీకి తీసుకెళ్లిన ఓ వ్యక్తి జూదంలో ఆమెను తాకట్టుపెట్టి ఓడిపోయాడు. అయితే అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత మహిళ తన స్వస్థలమైన బలియా జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో రూ. 2 లక్షలు ఇవ్వాలని భర్త వేధించాడని.. కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. డబ్బులు ఇవ్వనందుకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి బయటికి గెంటేశాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకుంది.
Tags :