Omicron scare: బూస్టర్లు ఇవ్వండి.. డోసుల మధ్య వ్యవధి తగ్గించండి..!

కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ఆందోళనల మధ్య.. బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలని, రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రానికి లేఖ రాశారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. ట్విటర్‌ ఖాతా పోస్టు ద్వారా లేఖ రాసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. 

Updated : 07 Dec 2021 17:01 IST

కేంద్రానికి రాసిన లేఖలో కోరిన మహారాష్ట్ర మంత్రి

ముంబయి: కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ఆందోళనల మధ్య.. బూస్టర్ డోసుకు అనుమతి ఇవ్వాలని, రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రానికి లేఖ రాశారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. ట్విటర్‌ ఖాతా పోస్టు ద్వారా లేఖ రాసిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. 

‘కొవిడ్ టీకా గురించి నేను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయాజీకి లేఖ రాశాను. వైద్యులు, కొవిడ్ పరిస్థితుల్నినిశితంగా గమనిస్తోన్న నిపుణులతో చర్చించిన మీదట కొన్ని సూచనలు చేశాను. తద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో మనం దేశ పౌరుల్ని రక్షించుకోవచ్చు ఇందు కోసం మూడు సూచనలు అంటూ ఆ లేఖను షేర్ చేశారు. టీకా కార్యక్రమం ప్రారంభమైన కొత్తల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌, వైద్య సిబ్బందికి మొదట టీకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారికి బూస్టర్లు వేయడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. టీకా తీసుకునేందుకు కనీస వయస్సును 15 సంవత్సరాలకు కుదించాలని సూచించారు. దాంతో ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు టీకా రక్షణ లభిస్తుందన్నారు. రెండు డోసుల మధ్య వ్యవధిని నాలుగు వారాలకు కుదించాలని పేర్కొన్నారు. దాని వల్ల టీకా పంపిణీ వేగవంతం అవుతుందని వెల్లడించారు. కరోనా మొదటి, రెండోదశల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసింది. ఈ రకం కేసులు దేశంలో ఇప్పటివరకు 23 బయటపడ్డాయి. మహారాష్ట్రలో 10 మందిలో దీన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆదిత్య కేంద్రానికి లేఖ రాశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని