Updated : 24 Nov 2021 14:18 IST

Abhinandan: అభినందన్‌ మా విమానాన్ని కూల్చలేదు: పాక్‌

లాహోర్‌: తమ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని భారత్‌ చేస్తున్న వ్యాఖ్యలను పాకిస్థాన్‌ ఖండించింది. భారత వైఖరి నిరాధారమైనదని ఆరోపించింది. బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడుల అనంతరం.. 2019 ఫిబ్రవరి 27న భారత వైమానిక దళ వింగ్‌ కమాండర్‌గా ఉన్న అభినందన్‌ వర్ధమాన్‌.. పాక్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని తన ధైర్య సాహసాలతో నేల కూల్చారు. ఆ తర్వాత ఆయన నడుపుతున్న మిగ్‌- 21 యుద్ధవిమానం.. పాకిస్థాన్‌లో కూలింది. అనంతరం వర్ధమాన్‌ను పాకిస్థాన్‌ నిర్బంధించి, చిత్రహింసలు పెట్టింది. ఆ తర్వాత మార్చి 1న రాత్రి ఆయన్ను విడుదల చేసింది. వర్ధమాన్‌ పోరాట పటిమకుగాను ‘వీర్‌ చక్ర’ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించిన నేపథ్యంలో మంగళవారం దీనిపై పాక్‌ స్పందించింది. వర్ధమాన్‌ తమ విమానాన్ని కూల్చివేయలేదని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాన్ని తమ పైలట్‌ కూల్చివేశాడని చెబుతున్న భారత్‌ వాదనను ఖండిస్తున్నాం. ఆరోజు ఎలాంటి విమానం నేలకూలలేదని అంతర్జాతీయ నిపుణులు, అమెరికా అధికారులు ఇదివరకే స్పష్టం చేశారు. దుందుడుకు చర్యలకు పాల్పడాలని చూసిన భారత పైలట్‌ను ఆరోజు విడుదల చేయడం.. శాంతికాముక దేశంగా పాకిస్థాన్‌ వైఖరికి నిదర్శనం’’ అని ఆ దేశ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని