Afghan women: మళ్లీ పారిపోతున్నాం.. మా వెంట ఉంది నిర్జీవమైన ఆత్మనే!

తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్ మహిళలు వణికిపోతున్నారు. మళ్లీ తమ బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నట్లేనని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు.. ఇక్కడ బతకలేం అంటూ దేశం దాటుతున్నారు. అఫ్గాన్ ఫిల్మ్‌మేకర్, ఫొటోగ్రాఫర్ రొయా హైదరీ పరిస్థితి కూడా అదే. దేశం విడిచి వెళ్తూ.. ఆమె పెట్టిన విదారక పోస్టు అఫ్గాన్ మహిళల మనోవేదనను ప్రతిబింబిస్తోంది.

Published : 27 Aug 2021 23:26 IST

కాబుల్: తాలిబన్ల రాకతో అఫ్గానిస్థాన్ మహిళలు వణికిపోతున్నారు. మళ్లీ తమ బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నట్లేనని ఆవేదన చెందుతున్నారు. మరికొందరు.. ఇక్కడ బతకలేం అంటూ దేశం దాటుతున్నారు. అఫ్గాన్ ఫిల్మ్‌మేకర్, ఫొటోగ్రాఫర్ రొయా హైదరీ పరిస్థితి కూడా అదే. దేశం విడిచి వెళ్తూ.. ఆమె పెట్టిన విదారక పోస్టు అఫ్గాన్ మహిళల మనోవేదనను ప్రతిబింబిస్తోంది.

‘బతుకుపోరాటం కోసం నా ఇంటిని, నా జీవితాన్ని విడిచిపెట్టి వెళ్తున్నా. మరోసారి.. నేను పుట్టినగడ్డను విడిచి పారిపోతున్నాను. మరోసారి.. సున్నా నుంచి నేను నిలదొక్కుకోవాలి. నా వెంట కెమెరాలు, నిర్జీవమైన ఆత్మను మాత్రమే తీసుకెళ్తున్నాను. తిరిగి వచ్చేవరకు.. మాతృభూమికి నా వీడ్కోలు’ అంటూ హైదరీ పెట్టిన పోస్టు హృదయాలను ద్రవింపజేస్తోంది. అలాగే విమానాశ్రయం వద్ద, భారమైన హృదయంతో వేచి ఉన్న చిత్రాన్ని ఆమె ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్రాన్స్ చేరుకున్నట్లు ఓ మీడియా సంస్థ తెలిపింది. 

హైదరీలాగే ఎంతో మంది అఫ్గాన్‌ మహిళలు, కుటుంబాలు తమ భవిష్యత్తును వెతుక్కుంటూ దేశం విడిచివెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని