permanent commission: మహిళా సైన్యాధికారులకు 10 రోజుల్లోగా శాశ్వత కమిషన్‌

ఆర్మీలో పనిచేస్తున్న మహిళా సైన్యాధికారుల పోరాటం ఫలించింది. మరో 11 మంది మహిళా సైన్యాధికారులకు కూడా శాశ్వత కమిషన్​ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది.......

Published : 12 Nov 2021 20:40 IST

దిల్లీ: ఆర్మీలో పనిచేస్తున్న మహిళా సైన్యాధికారుల పోరాటం ఫలించింది. మరో 11 మంది మహిళా సైన్యాధికారులకు కూడా శాశ్వత కమిషన్​ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. శాశ్వత కమిషన్​ ఏర్పాటుపై 10 రోజుల్లోగా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టుకు తెలిపింది. అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ శాశ్వత కమిషన్ కోసం తమ దరఖాస్తులను తిరస్కరించారని ఆరోపిస్తూ 11 మంది మహిళాధికారులు గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్​ 1లోగా మహిళా అధికారులకు కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో తీర్పునిచ్చింది. అయితే ఈ  ఆదేశాలను సైన్యం అమలు చేయలేదు. దీంతో ఆర్మీపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు స్పందించింది. వారికి కూడా శాశ్వత కమిషన్‌ను మంజూరు చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని