Coal Shortage: దేశంలో బొగ్గు కొరత.. అమిత్‌ షా కీలక భేటీ..!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. బొగ్గు, విద్యుత్‌ శాఖతో పాటు పలువురు కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు.

Published : 11 Oct 2021 23:35 IST

రాష్ట్రాల ఆందోళనల నేపథ్యంలో అధికారులతో సమీక్ష

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నట్లు పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల ఆందోళనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పలువురు కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు. విద్యుత్‌ సంక్షోభ నివారణ, రాష్ట్రాలకు సరిపడా బొగ్గు, గ్యాస్‌ నిల్వలు, వాటి సరఫరాపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితోపాటు పలువురు కేబినెట్‌ మంత్రులు, ఎన్‌టీపీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడబోతోందంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ అనవసర భయాలేనని స్పష్టం చేసింది. విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద 7.2 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి నాలుగు రోజులకు సరిపోతాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా కోల్‌ ఇండియా వద్ద 40మిలియన్‌ టన్నుల నిల్వలు ఉన్నాయని పేర్కొంది. విద్యుత్‌ సంక్షోభం ఉండబోదని.. బొగ్గు అవసరమైన రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని