- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Anand Mahindra: కొవిడ్ విషం చిమ్మినా.. ఆ కన్నతండ్రి కష్టం చూస్తే..!
ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొత్త సంవత్సరం పట్ల ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించారు. కొవిడ్ చిమ్మిన విషం నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాక్షించిన ఆయన.. రెండు స్ఫూర్తిదాయక సందేశాలను ట్విటర్లో షేర్ చేశారు.
‘కొత్త సంవత్సరం పట్ల నాకున్న ఆశలన్నీ ఈ ఒక్క వీడియోలోనే కనిపిస్తాయి. తీవ్రమైన విష ప్రభావానికి గురై కోలుకున్న ఈ ఆండియన్ కాండర్ (దక్షిణ అమెరికాకు చెందిన పక్షి)ను పెరూవియన్ పర్వతాల వద్ద వదిలేశారు. కొవిడ్ ఈ ప్రపంచాన్ని విషతుల్యం చేసింది. 2022లో మనం కూడా ఆ ప్రభావం నుంచి బయటపడొచ్చు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అంటూ పర్వతాల మధ్య ఎగురుతున్న ఆ పక్షి వీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. విషం బారినపడి కోలుకున్న తర్వాత అది స్వేచ్ఛగా ఎగరడం ఆ వీడియోలో చూడొచ్చు.
‘ఈ ఏడాది నేను అమితంగా ఇష్టపడిన ఫొటో ఇది. క్షమించండి.. దీన్ని ఎవరు తీశారో నాకు తెలీదు. ఇది నా ఇన్‌బాక్స్‌లో కనిపించింది. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క దృశ్యం తెలియజేస్తోంది’ అంటూ మరో ఫొటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఇందులో ఓ తండ్రి చదువుకుంటున్న తన కుమారుడిని తోపుడు బండిపై తీసుకెళ్తూ కనిపించాడు. కొడుకేమో పుస్తకంలో రాసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
-
Technology News
Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!
-
Technology News
OnePlus Folding Phone: వన్‌ప్లస్ మడత ఫోన్ సిద్ధమవుతోంది..!
-
India News
Independence Day: ఎర్రకోటపై స్వాతంత్ర్య వేడుకలు.. అతిథులుగా వీధి వ్యాపారులు
-
World News
Independence Day: భారత్‌కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షల వెల్లువ
-
Politics News
Pawan Kalyan: పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడిని: పవన్‌కల్యాణ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం