Anthony Fauci: ప్రపంచాన్ని ఒమిక్రాన్ చుట్టుముడుతోంది..మూడో డోసు తప్పనిసరి!
సులభంగా వ్యాపించే గుణమున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రచండ వేగంతో ప్రపంచదేశాలను చుట్టుముడుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షభవనం వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు.
వాషింగ్టన్: సులభంగా వ్యాపించే గుణమున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రచండ వేగంతో ప్రపంచదేశాలను చుట్టుముడుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అమెరికా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ఇన్‌ఫెక్షన్ ముప్పును మరింత పెంచుతుందని సూచించారు. రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందన్న ఆయన.. తప్పకుండా బూస్టర్ డోసు తీసుకోవాలని అమెరికన్లకు సూచించారు.
కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీడే సీజన్ కావడంతో ప్రజలు విహారయాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేగాన్ని కట్టడి చేయాలంటే మాస్కులు ధరించడంతోపాటు బూస్టర్ డోసు తీసుకోవాలని ఫౌచీ సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్ అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో వెలుగు చూసిందని చెప్పారు.
ఇదిలా ఉంటే, విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ తీవ్రత దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ నిత్యం వేల సంఖ్యలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు అమెరికాలోనూ కొత్త వేరియంట్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. న్యూయార్క్‌లో పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది. అయితే, వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు వ్యాధి తీవ్రత తక్కువగా కనిపిస్తుండడం కాస్త ఊరట కలిగించే విషయం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ