
Aryan Khan: బెయిల్ కండీషన్.. మరోసారి ఎన్సీబీ ముందుకు ఆర్యన్
ముంబయి: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు హాజరయ్యాడు. ఈ రోజు మధ్యాహ్నం రెండులోపు హాజరుకావాల్సి ఉండటంతో.. కార్యాలయానికి వచ్చాడు.
అక్టోబర్ నెల ప్రారంభంలో ముంబయిలో క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. తర్వాత బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మూడు రోజుల వాదనల అనంతరం బెయిల్ దక్కింది. దాంతో సుమారు మూడు వారాల తర్వాత ఆర్థర్ రోడ్డు జైలు నుంచి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో కోర్టు ఆర్యన్‌కు 14 షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో ఉదయం 11గంటలు - మధ్యాహ్నం 2గంటల మధ్య హాజరు కావడం అందులో ఒకటి. దానిలో భాగంగా అతడు ఈ రోజు ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు.
ఇదిలా ఉండగా.. ఈ డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాంఖడే డబ్బు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఈ సంస్థ వాంఖడేపై విచారణ జరుపుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.