Updated : 07/12/2021 13:57 IST

Omicron: మొదటి ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరికి మరోసారి వైరస్‌ పాజిటివ్‌..!

బెంగళూరు: భారత్‌లో మొదటి ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన వ్యక్తుల్లో ఒకరైన బెంగళూరు వైద్యుడికి మరోసారి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఏడు రోజుల తర్వాత మరోసారి నిర్ధారణ పరీక్ష నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చిందని సంబంధిత అధికారి వెల్లడించారు. దాంతో ప్రస్తుతం బాధితుడిని వైద్యుల సమక్షంలో పర్యవేక్షణలో ఉంచారు. ఏడురోజుల తర్వాత మరోసారి పరీక్ష నిర్వహిస్తామని, అప్పుడు నెగెటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాతే ఇంటికి పంపుతామని తెలిపారు.

దేశంలో మొదటిసారి కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 46 ఏళ్ల బెంగళూరు వైద్యుడు, 66 ఏళ్ల మరో వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఆ వైద్యుడితో సన్నిహితంగా ఉన్న ఐదుగురికి పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం నాటికి ఈ ఇద్దరు ఒమిక్రాన్ బాధితులతో సన్నిహితంగా ఉన్న సుమారు 200 మందిని గుర్తించి, కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. 

థానెకు తలనొప్పిగా మారిన ఆ 100 మంది..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 23 మందిలో ఈ రకాన్ని గుర్తించారు. అయితే ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన కొందరి జాడ దొరకపోవడమే ప్రభత్వాలకు తలనొప్పిగా మారింది. తాజాగా మహారాష్ట్రలోని థానె జిల్లాలో 100 మంది ఆచూకీ కోసం అధికారులు చర్యలు చేపట్టారు.

దీనిపై కల్యాణ్ డొంబీవాలీ మున్సిపల్ కార్పొరేషన్ విజయ్ సూర్యవంశీ మీడియాతో మాట్లాడారు. ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి థానెలోని టౌన్‌షిప్‌కు 295 మంది విదేశాల నుంచి వచ్చారు. వారిలో 109 మంది ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. వారి మొబైల్ నంబర్లకు ఫోన్ చేస్తుంటే స్విచ్‌ఆఫ్ వస్తోందని తెలిపారు. వారు ఇచ్చిన చిరునామాల్లోని ఇళ్లకు తాళం వేసి ఉందన్నారు. ముప్పు దేశాల నుంచి వచ్చిన వారంతా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఎనిమిదో రోజు కొవిడ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని