Taliban: బైడెన్ తప్పుమీద తప్పు.. తాలిబన్లు వెతుకుతున్న జాబితా చేతికిచ్చిన అమెరికా
అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్ సర్కారుమ చేస్తున్న తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు
ఇంటర్నెట్‌డెస్క్: అఫ్గాన్ నుంచి దళాల ఉపసంహరణ విషయంలో అమెరికాలోని బైడెన్ సర్కారు చేస్తోన్న తప్పులకు అంతూపొంతు లేకుండా పోతోంది. తాజాగా మరో మహా తప్పిదం చేసినట్లు న్యూయార్క్ పోస్టు పత్రిక వెలుగులోకి తెచ్చింది. అఫ్గానిస్థాన్‌లో అమెరికాకు సాయం చేసిన వ్యక్తుల జాబితాను తాలిబన్ల చేతికిచ్చినట్లు పేర్కొంది. ఇప్పుడు తాలిబన్లు ఆ జాబితా ఆధారంగా హిట్‌లిస్టు రూపొందించుకుని వారి కోసం వెతుకుతున్నారు. శ్వేత సౌధం బ్రీఫింగ్ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే.. ‘జరిగి ఉండొచ్చు’ అనే సమాధానం వచ్చింది.
ఎలా జరిగింది..?
ఆగస్టు 15న కాబుల్ ఆక్రమణ తర్వాత అమెరికా అధికారులు తాలిబన్లకు ఒక జాబితా ఇచ్చారు. దీనిలో అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డ్ లభించిన వారు, అఫ్గాన్‌లో మిత్రులు ఉన్నారని.. వారిని విమానాశ్రయంలోకి అనుమతించాలని తాలిబన్లకు సూచించారు. తాలిబన్లు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకొన్న విషయం తెలిసిందే.
గతంలో అమెరికాకు సాయం చేసిన వారిని క్రూరంగా చంపిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఈ నేపథ్యంలో చివరి సమయంలో తాలిబన్లను గుడ్డిగా నమ్మి ఈ జాబితాను అప్పజెప్పింది.
కాబుల్ విమానాశ్రయంపై దాడి అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో బైడెన్ ఇటువంటి జాబితాను అసలు అప్పజెప్పలేదని కచ్చితంగా చెప్పలేకపోయారు. విమానాశ్రయానికి వచ్చే సమయంలో తమ వారిని లోపలకి వదలమని చెప్పి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
తాలిబన్లు ఇంటింటికీ వెళ్లి వెతుకుతూ..
తాలిబన్లు అమెరికాకు సాయం చేసిన వారిని పట్టుకొనేందుకు ఇంటింటికీ వెళ్లి సోదాలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో అమెరికాకు వివిధ దశల్లో సాయం చేసిన వేలమంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి.
అమెరికా వీసా కోసం అప్లై చేసిన చాలా మంది.. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించాక విమానాశ్రయం చేరుకున్నారు. దీంతో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వారిని కొన్నాళ్లు వేచి ఉండమని పేర్కొంది. ఇప్పటికే వారు తాలిబన్లకు ఇచ్చిన జాబితాలను క్లియర్ చేసేదాకా కొత్తవారి పేర్లను తరలించేవారి జాబితాలో చేర్చమని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన
ఎయిర్‌పోర్టు(Airport)లో ఆగిఉన్న ఒక విమానాన్ని మరో విమానం ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళన వ్యక్తమైంది. -
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
ఓ కండక్టర్ బస్సులోని మహిళా ప్రయాణికురాలిపై దాడి చేసిన వీడియో వైరలవడంతో అధికారులు ఆ కండక్టర్‌ను సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. -
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
తన అరెస్టును సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు. -
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్‌కు పోలింగ్ సిబ్బంది రెడీ!
అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లోని ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళా ఓటరు కోసం పోలింగ్ సిబ్బంది దాదాపు 39 కి.మీ.ల దూరం ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!
India - Myanmar: భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 1600 కిలోమీటర్ల కంచె నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్లు వెచ్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
‘సునీత.. రబ్రీ దేవిలా మారనున్నారా?’.. వీడియో సందేశంపై భాజపా విమర్శలు!
ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని సునీత వినిపించడంపై విమర్శలు గుప్పించిన భాజపా.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగా ఆమె కూడా మారనున్నారనే అనుమానం వ్యక్తం చేసింది. -
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో
ఓ రాజకీయ నేతకు చెందిన ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో ఆయన కరెన్సీ నోట్ల (Currency notes) పై హాయిగా నిద్రిస్తుండటమే కారణం. -
కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ వర్గాల వెల్లడి
Arvind Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆప్ వర్గాలు ఆరోపించాయి. -
కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్ కేసు
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెపై ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది. -
దిలీప్ ఘోష్‌కు భాజపా షోకాజ్ నోటీసులు.. క్షమాపణలు చెప్పిన ఎంపీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యపై వివరణ కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆయనకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఘోష్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. -
నిరుద్యోగ సమస్యపై ‘సీఈఏ’ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
‘అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు’ అని ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. -
కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం
Kejriwal arrest: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ రేపు కోర్టులో చెబుతారు: సతీమణి సంచలన ప్రకటన
Sunita Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన సతీమణి సునీత మరో వీడియో సందేశం విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి నిజాలన్నీ ఆయన గురువారం కోర్టులో బయటపెడతారని చెప్పారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం
Encounter: బీజాపుర్ జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో మునావర్ ఫరూఖీ
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ(Munawar Faruqui)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
బిహార్‌లో ఒకే ఇంట్లో ఏడుగురు ‘పోలీస్’ సిస్టర్స్..
బిహార్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు - అబ్కారీ శాఖల్లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. -
ఓటీపీ మోసాలకు సరికొత్త విరుగుడు
ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్వర్డ్ హ్యాకింగ్ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
గాజా వివాదంపై అమెరికా తీరుకు నిరసన.. పీహెచ్డీ డిగ్రీనీ వెనక్కి ఇచ్చేసిన సందీప్‌పాండే
దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. -
భాజపా మాయ నుంచి యువత బయటకు రావాలి
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని భాజపా నిలబెట్టుకోలేదు. అబద్ధపు వాగ్దానం ఎందుకు చేశారని యువత ఇప్పుడు ఆ పార్టీని ప్రశ్నిస్తోంది. -
యూట్యూబ్ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు
సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్ తొలగించింది. -
2-3 రోజుల్లో 5లక్షల టన్నుల ఉల్లి సేకరణ
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని పొడిగించడం వల్ల మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువు ధర పడిపోవచ్చని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్‌పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..