Haryana: హరియాణాలో లఖింపుర్‌ ఖేరి తరహా ఘటన..!

హరియాణాలోని నారాయణ్‌గఢ్‌లో లఖింపుర్ ఖేరి తరహా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేపడుతోన్న రైతులను ఢీ కొడుతూ భాజపా ఎంపీ నాయబ్ సైనీ కారు దూసుకెళ్లినట్లు నిరసనకారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని అంబాలాలోని నారాయణ్ గఢ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 

Published : 08 Oct 2021 02:38 IST

ఒక రైతుకు గాయాలు.. 

ఢీ కొట్టిన వాహనం భాజపా ఎంపీదేనన్న రైతన్నలు

చండీగఢ్‌: హరియాణాలోని నారాయణ్‌గఢ్‌లో లఖింపుర్ ఖేరి తరహా ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేపడుతోన్న రైతులను ఢీ కొడుతూ భాజపా ఎంపీ నాయబ్ సైనీ కాన్వాయ్ వాహనం దూసుకెళ్లినట్లు నిరసనకారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని అంబాలాలోని నారాయణ్ గఢ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 

గురువారం ఉదయం సైనీ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి నాయబ్ సైనీతో పాటు హరియాణా గనుల శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ, ఇతర నేతలు హాజరయ్యారు. భాజపా నేతలు వచ్చారన్న విషయం తెలుసుకున్న రైతన్నలు సైనీ భవన్‌  బయట గుమిగూడి నిరసన తెలిపారు. మరోపక్క కార్యక్రమం పూర్తి కావడంతో నేతలు అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఒక వాహనం నిరసనకారులను ఢీ కొట్టినట్లు వారు తెలిపారు. అది భాజపా ఎంపీ నాయబ్ సైనీ వాహనంగా వారు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒక రైతుకు గాయాలైనట్లు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటన మరువకముందే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలకు వ్యతిరేకంగా లఖింపుర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న రైతులపై కొన్ని వాహనాలు దూసుకెళ్లాయి. దాంతో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన నిందితుల్లో కేంద్రమంత్రి తనయుడు కూడా ఉన్నాడని తెలియడంతో అది కాస్తా దేశవ్యాప్తంగా సంచలనం అయింది. హత్యారోపణలు ఎదుర్కొంటోన్న ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని