Bipin Rawat: రావత్ మరణం.. భారత్‌, పాక్ మాజీ సైనికాధికారులు ఏం మాట్లాడుకున్నారంటే..?

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్‌) బిపిన్ రావత్‌ మృతి ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆయన ఆకస్మిక మరణం అందరినీ ఉద్వేగానికి గురిచేసింది. ఈ క్రమంలో భారత్‌, పాకిస్థాన్‌కు చెందిన సైన్యంలోని ఇద్దరు మాజీ అధికారులు స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

Published : 09 Dec 2021 18:11 IST

దిల్లీ: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్‌) బిపిన్ రావత్‌ మృతి ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆయన ఆకస్మిక మరణం అందరినీ ఉద్వేగానికి గురిచేసింది. ఈ క్రమంలో భారత్‌, పాకిస్థాన్‌కు చెందిన సైన్యంలోని ఇద్దరు మాజీ అధికారులు స్పందించిన తీరు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

బ్రిగేడియర్(రిటైర్డ్‌) ఆర్ఎస్ పఠానియా..‘సెల్యూట్ సర్, జై హింద్’ అంటూ బిపిన్ రావత్‌కు ట్విటర్ వేదికగా నివాళి అర్పించారు. దీనిపై పాకిస్థాన్‌కు చెందిన మాజీ మేజర్ అదిల్ రాజా బదులిచ్చారు. ‘సర్, దయచేసి నా హృదయపూర్వక సంతాపాన్ని అంగీకరించండి’ అని కోరారు. 

పఠానియా: ధన్యవాదాలు అదిల్‌. ఒక సైనికుడి నుంచి ఈ స్పందనే కోరుకునేది. మీకు సెల్యూట్‌.

అదిల్: అవును సర్. సైనికుడిగా ఇలా వ్యవహరించడం సరైనది. మీకు జరిగిన నష్టానికి మరోసారి నా సంతాపం తెలియజేస్తున్నాను. పంజాబీ జానపద కథ ప్రకారం.. మీ శత్రువులకు జరిగిన నష్టాన్ని వేడుకగా జరుపుకోకండి. ఏదోఒక రోజు స్నేహితులు కూడా దూరమవుతారు.

పఠానియా: మరోసారి ధన్యావాదాలు అదిల్‌. నాకు పంజాబీ అర్థం అవుతుంది. యుద్ధభూమిలో మనం శత్రువులం. మనం స్నేహితులుగా ఉండలేపోయినా.. మంచి ప్రవర్తనతో ఉందాం. 

అదిల్‌: శాంతి ఒక్కటే తార్కిక మార్గం సర్.. అంటూ ముగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని