Updated : 08/12/2021 21:44 IST

Bipin Rawat: బిపిన్‌ రావత్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

దిల్లీ: తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతి చెందడం బాధాకరమని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు  రావత్‌ మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ప్రమాదం నుంచి తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కప్టెన్ వరుణ్‌ సింగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ధైర్యవంతుడైన సైనికుడిని దేశం కోల్పోయింది: రాష్ట్రపతి

సైనిక హెలికాప్టర్ ఘటన తనను తీవ్రంగా బాధించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక మరణం తనను షాక్‌కి గురిచేసిందన్నారు. ఓ ధైర్యవంతుడైన సైనికుడ్ని దేశం కోల్పోయిందని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు మాతృభూమికి నిస్వార్థంగా సేవలందించిన బిపిన్‌ రావత్‌ తన శౌర్యంతో, వీరత్వంతో గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

అంకిత భావంతో సేవలందించారు: ప్రధాని

సీడీఎస్‌ బిపిన్‌ రావత్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆర్మీ సిబ్బంది అంకిత భావంతో దేశానికి సేవలందించారు. మరణించిన ఆర్మీ సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మాతృభూమికి సేవ చేసిన ధైర్యవంతుడు: అమిత్‌ షా

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంతాపం తెలిపారు. రావత్‌ మాతృభూమికి సేవ చేసిన ధైర్యవంతుడైన సైనికుడు.. వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మాటల్లో చెప్పలేమన్నారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బిపిన్‌ రావత్‌ మరణం దేశానికి తీరని లోటు: రాజ్‌నాథ్‌

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరనలి లోటని ట్విటర్‌ లో పేర్కొన్నారు. 




Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని