Farm Laws: సాగు చట్టాల రద్దు.. స్పందించిన సినీరంగ ప్రముఖులు

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశ ప్రజలను ఆశ్చర్యపర్చింది. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీ రంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. 

Published : 19 Nov 2021 13:36 IST

కంగన ఏమని పోస్టు చేసిందంటే..?

ముంబయి: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశ ప్రజలను ఆశ్చర్యపర్చింది. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరి విజయమంటూ నెట్టింట్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ పన్ను ఈ ప్రకటనను ఉద్దేశిస్తూ.. అందరికీ గురు నానక్‌ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఇదొక అద్భుతమైన విషయం! సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. శాంతియుత నిరసనల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకొన్న అన్నదాతలకు అభినందనలు. ఈ ప్రకాశ్ దివస్‌ రోజున మీ కుటుంబాల చెంతకు సంతోషంగా తిరిగి వెళ్తారని ఆశిస్తున్నాను.. బాలీవుడ్ నటుడు సోనూసూద్‌

> ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. భారీ మూల్యం చెల్లించారు. చివరకు తమ డిమాండ్లను శాంతియుతంగా సాధించుకున్నందుకు గర్వపడుతున్నాను. జై కిసాన్.. జై హింద్‌... శృతి సేథ్‌

> మీరు గెలిచారు.. మీ విజయం అందరిది.. నటి రిచా చద్దా

> అంతిమంగా విజయం మీదే. రైతులందరికీ శుభాకాంక్షలు. గురునానక్ జయంతి సందర్భంగా దక్కిన గొప్ప బహుమతి... హిమాన్షి ఖురానా

కంగన కామెంట్‌ ఏంటో తెలుసా..?

స్ట్రీట్ పవర్‌ (వీధిపోరాటం) గొప్పదని నిరూపితమైందంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ షేర్‌ చేస్తూ కంగన కేంద్రం నిర్ణయంపై స్పందించారు. ‘విచారకరం, అవమానకరం, అన్యాయం’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ‘పార్లమెంట్‌లో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని