Third Wave: అత్యవసర ఔషధాలను నిల్వ చేస్తోన్న కేంద్రం..!

కొవిడ్‌ మూడోముప్పు పొంచి ఉందన్న వార్తల మధ్య దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది.

Published : 19 Jul 2021 14:22 IST

ఆ జాబితాలో రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్..

దిల్లీ: కొవిడ్‌ మూడోముప్పు పొంచి ఉందన్న వార్తల మధ్య దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. 30 రోజులకు సరిపడా వైద్యసామగ్రిని నిల్వ చేస్తోంది. దానిలో భాగంగా కొవిడ్ చికిత్సలో కీలకమైన రెమ్‌డెసివిర్, ఫావిపిరవిర్ వంటి ఔషధాలను సమకూర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఓ మీడియా కథనం వెల్లడించింది. ఆ జాబితాలో పారాసెటమాల్, యాంటీబయోటిక్స్, విటమిన్‌ మాత్రలు కూడా ఉన్నట్లు చెప్పింది.

‘మూడో ముప్పుపై వార్తల నేపథ్యంలో ఐదు మిలియన్ల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది’ అని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఆగస్టు చివరినాటికి మూడో దఫా వైరస్ విజృంభణ ఉండే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) అంచనా వేసింది. అప్పుడు రోజుకు లక్ష కేసులు నమోదవ్వచ్చని తెలిపింది. అలాగే ఈ సమయంలో వైరస్ తీవ్రత గురించి మాట్లాడుతూ.. వైరస్ మ్యుటేట్ అవ్వకపోతే, మొదటి దఫాలో నెలకొన్న పరిస్థితులే ఉంటాయంది. అదే మహమ్మారి మార్పులు చెందితే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయని అభిప్రాయపడింది. మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు కానీ, ఆంక్షల సడలింపుల వల్ల కేసులు పెరుగుతాయంది. తక్కువ స్థాయిలో జరుగుతోన్న టీకా పంపిణీ కూడా ప్రభావం చూపుతుందని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని