Pegasus: అనుమానాలు తొలగించేందుకు.. పెగాసస్‌పై విచారణ కమిటీ

పెగాసస్ హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవంటూ పేర్కొంది.

Updated : 29 Feb 2024 14:14 IST

సుప్రీంకు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: పెగాసస్ హ్యాకింగ్‌పై వచ్చిన ఆరోపణలను అన్ని కోణాల్లో పరిశీలించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే ఈ కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.

‘పెగాసస్ హ్యాకింగ్ ఆరోపణలను కేంద్రం నిస్సందేహంగా తిరస్కరిస్తోంది. దానిపై వెలువడిన కథనాలు ఊహాజనితమైనవి. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. స్వార్థ ప్రయోజనంతో వ్యాప్తి చేసే ఇలాంటి కథనాలపై నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనుంది’ అని కేంద్రం సుప్రీంకు వెల్లడించింది.

సరిగ్గా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు ఈ పెగాసస్ వ్యవహారంపై కథనాలు వెలువడ్డాయి. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నారని పేర్కొన్నాయి. రాజకీయ ప్రముఖులు, సీబీఐ అధికారులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తల ఫోన్‌ నంబర్లు హ్యాక్‌ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని కేంద్రం తోసిపుచ్చింది. మరోపక్క దీనిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారణ జరుపుతోంది. దానిలో భాగంగా తాజాగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని