China Stock Exchange: చైనాలో కొత్తగా మరో స్టాక్‌ ఎక్ఛేంజీ!

చైనాలో కొత్తగా మరో స్టాక్‌ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వెల్లడించారు. దేశీయ సంస్థలు విదేశాలకు బదులుగా స్థానికంగానే నమోదు చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

Published : 02 Sep 2021 22:45 IST

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటన

బీజింగ్‌: చైనాలో కొత్తగా మరో స్టాక్‌ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వెల్లడించారు. దేశీయ సంస్థలు విదేశాలకు బదులుగా స్థానికంగానే నమోదు చేసుకునేందుకు వీలుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అక్కడ రెండు స్టాక్‌ ఎక్ఛేంజీలు (షాంఘై, షెన్‌జెన్‌) ఉండగా.. కొత్తగా దీనిని బీజింగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఊతమివ్వడంలో భాగంగా ఈ నూతన స్టాక్‌ ఎక్ఛేంజీని ఏర్పాటు చేయబోతున్నట్లు బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ట్రేడ్‌ ఫెయిర్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. అయితే, వాటికి ఎలాంటి సహకారం ఉంటుందనే విషయాలు మాత్రం అధ్యక్షుడు వెల్లడించలేదు.

మరోవైపు గతకొన్ని రోజులుగా టెక్ కంపెనీలతో పాటు పలు కంపెనీలపై చైనా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. చిన్నారులు వారంలో కేవలం కొన్ని గంటలపాటే వీడియో గేమ్‌లు ఆడుకునేలా ఈ మధ్యే ఆంక్షలు విధించారు. అంతేకాకుండా టీవీల్లో టాలెంట్‌ పోటీలను కూడా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు పలు కీలక రంగాల్లో చైనా అధికారులు నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు నూతన స్టాక్‌ ఎక్ఛేంజీ ప్రకటన చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని