Havana Syndrome: భారత్‌లో పర్యటించిన అమెరికా అధికారిలో హవానా సిండ్రోమ్‌..!

అగ్రరాజ్యం అమెరికా శాస్త్రవేత్తలకు అంతుపట్టని హవానా సిండ్రోమ్ గురించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ విలియమ్ బర్న్స్‌తో కలిసి భారత్‌లో ప్రయాణించిన ఏజెన్సీ అధికారిలో హవానా లక్షణాలు కనిపించినట్లు సమాచారం. 

Updated : 21 Sep 2021 15:34 IST

ఈ నెలలోనే వెలుగుచూసిందన్న అమెరికా మీడియా 

(ప్రతీకాత్మక చిత్రం)

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా శాస్త్రవేత్తలకు అంతుపట్టని హవానా సిండ్రోమ్ గురించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ విలియమ్ బర్న్స్‌తో కలిసి భారత్‌లో ప్రయాణించిన అధికారిలో హవానా లక్షణాలు కనిపించినట్లు సమాచారం. ఈ నెలలోనే ఈ ఘటన వెలుగుచూసిందని అమెరికా వార్తా సంస్థలు నివేదించాయి. ఆ బాధిత వ్యక్తి చికిత్స పొందాల్సి ఉందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొన్నాయి. అయితే, నిబంధనల దృష్ట్యా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం సాధ్యంకాదని సీఐఏ అధికారి ప్రతినిధి వెల్లడించారు. 

హవానా సిండ్రోమ్‌ను 2016లో తొలిసారి క్యూబాలోని హవానా నగరంలోని అమెరికా దౌత్యకార్యాలయం సిబ్బందిలో గుర్తించారు. ఆ నగరం పేరుమీదుగా దీన్ని హవానా సిండ్రోమ్‌గా పిలుస్తున్నారు. దానికి గురైన వారిలో మైగ్రెయిన్, వికారం, జ్ఞాపకశక్తి మందగించడం, మైకం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. గత ఐదేళ్ల కాలంలో దాదాపు 200 మంది దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. మైక్రోవేవ్ తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అమెరికా అనుమానిస్తోంది. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన ఈ సిండ్రోమ్ కారణంగానే కొన్ని గంటల పాటు ఆలస్యమైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని