CJI: నల్సా యాప్‌ను ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి...

Updated : 08 Aug 2021 18:00 IST

దిల్లీ: జాతీయ న్యాయ సేవా కేంద్రం-నల్సా యాప్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా న్యాయసేవలు నేరుగా ప్రజలకు చేరువ కానున్నాయి. ఈ సందర్భంగా నల్సా మొబైల్‌ యాప్‌ సేవలను జస్టిస్‌ ఎన్వీ రమణ కొనియాడారు. పోలీస్‌ స్టేషన్లలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ఠాణాల్లో ఇప్పటికీ మానవహక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమన్నారు. కస్టోడియల్‌ టార్చర్‌ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం లేక న్యాయసహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయని, అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ సమర్ధంగా న్యాయ సేవలు అందించామని సీజేఐ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని