Modi: వారణాసి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సొంత నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటిస్తున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆయనకు యూపీ గరవ్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆదిత్యనాథ్ ఈ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసి.. రాష్ట్ర ప్రజలందరి తరఫున మోదీకి ఆహ్వానం పలికారు. 

Published : 15 Jul 2021 11:38 IST

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం తన సొంత నియోజకవర్గమైన యూపీలోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం వారణాసి చేరుకున్న ఆయనకు ఆ రాష్ట్ర గరవ్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. ఆదిత్యనాథ్ ఈ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేసి.. రాష్ట్ర ప్రజలందరి తరఫున మోదీకి ఆహ్వానం పలికారు. 

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.744 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు.. రూ.839 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే  జపాన్ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్‌’ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts