Congress:శాంటాఅందరి కోరికలు వింటాడు.. మోదీ మనసులో మాటే వింటారు..

ఈ క్రిస్మస్ పండగ వేళ.. కాంగ్రెస్ పార్టీ  కేంద్ర ప్రభుత్వంపై కొత్త తరహాలో విమర్శలు చేసింది. ఈ పండగ అనగానే ముందుగా గుర్తొచ్చే శాంతాక్లాజ్‌ను తన ట్వీట్లలో భాగంచేసి, విమర్శల పదును పెంచింది.

Updated : 25 Dec 2021 14:05 IST

క్రిస్మస్ వేళ.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ విమర్శలు

దిల్లీ: ఈ క్రిస్మస్ పండగ వేళ.. కాంగ్రెస్ పార్టీ  కేంద్ర ప్రభుత్వంపై కొత్త తరహాలో విమర్శలు చేసింది. ఈ పండగ అనగానే ముందుగా గుర్తొచ్చే శాంటాక్లాజ్‌ను తన ట్వీట్లలో భాగంచేసి, విమర్శల పదును పెంచింది. చమురు ధరలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ వరుస ట్వీట్లు చేసింది. క్రిస్మస్ వేళ శాంటా చేసే పనులకు, కేంద్రం ప్రభుత్వ తీరుకు ముడిపెడుతూ ఇలా ట్విటర్‌లో స్పందించింది.

* థాంక్‌గాడ్‌.. శాంటాక్లాజ్‌ ఇంధనం కోసం భారీగా చెల్లించాల్సిన అవసరం లేదు. శాంతా స్లీగ్‌ మీద ప్రయాణిస్తాడు కాబట్టి సరిపోయింది.

* మన సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టకుండా.. వస్తువుల్ని కొంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా..! తాను ఇచ్చే బహుమతులన్నింటినీ శాంటా ఉత్తర ధ్రువం నుంచి తెస్తున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఇక్కడైతే ఖర్చు తడిసిమోపడయ్యేది.

* మన ప్రభుత్వం వద్ద ఏ సమాచారం ఉండదు. అదే శాంటా అయితే ఎవరు అల్లరివారో, ఎవరు మంచి పిల్లలో ముందస్తుగా ఒక జాబితాను సిద్ధం చేసుకుంటాడు.

* ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజల సమస్యలు వినే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దేవుడి దయ వల్ల శాంటా అందరి కోరికలు వింటున్నాడు. మోదీ మాత్రం తన మనసులో మాట మాత్రమే వింటున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని