Published : 28 Dec 2021 22:28 IST

Congress: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అపశృతి.. వీడియో వైరల్‌

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో అపశృతి దొర్లింది. మంగళవారం దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ జెండాను ఆవిష్కరిస్తుండగా.. అది జెండా స్తంభంపై నుంచి పడిపోయింది. ఆ కార్యక్రమం ఆలస్యం కాకుండా ఉండేందుకు సోనియాతో పాటు అక్కడే ఉన్న ఇతర నేతలు పవన్ బన్సల్, కేసీ వేణుగోపాల్‌ తమ చేతిలో జెండాను పట్టుకొని కొద్దిసేపు ప్రదర్శించారు. తర్వాత పార్టీ కార్యకర్త ఒకరు జెండాను స్తంభానికి అమర్చారు. కాగా ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

ఇక, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం రాహుల్ ట్వీట్ చేశారు. భారత దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేసిన పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే రోజున 1885లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్