
Covid Deaths: ఆ కుటుంబాలకు ₹4లక్షల పరిహారానికి కాంగ్రెస్ క్యాంపెయిన్
దిల్లీ: దేశంలో కొవిడ్ కాటుకు బలైపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనత్తిన కాంగ్రెస్.. ఇందుకోసం శనివారం ఓ ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల బాధల్ని, వారికి కలిగిన నష్టాన్ని పట్టించుకోకుండా కేంద్రం నిద్రపోతోందని హస్తం పార్టీ మండిపడింది. కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹4లక్షల చొప్పున పరిహారం అందేలా చూడటమే లక్ష్యంగా ‘#SpeakUpforCovidNyay’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ ప్రచార కార్యక్రమాన్ని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ప్రజలకు కష్టనష్టాలు ఎదురైన సమయంలో కేంద్ర ప్రభుత్వం నిద్రపోతోందని, ఆ మొద్దు నిద్రనుంచి లేపుదామని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొవిడ్ మరణాలను తగ్గించి చూపడం ద్వారా కరోనా నియంత్రణలో తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకొనేందుకు వ్యూహాత్మంగా ప్రయత్నిస్తోందన్నారు.
తమ వారిని కోల్పోయిన బాధల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ మండిపడింది. ప్రభుత్వం వద్ద కొవిడ్ మరణాల సమాచారం లేకపోతేనేం.. ఆ సమాచారాన్ని కేంద్రంతో పంచుకొనేందుకు యావత్ దేశం సిద్ధంగా ఉందన్నారు. నిధుల కొరత సమస్య కాదనీ.. ఆయా కుటుంబాలకు సహాయం చేసే ఉద్దేశం కేంద్రానికి లేకపోవడమే అసలు సమస్య అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి ₹4లక్షలు చెల్లించాలనేదే తమ డిమాండ్ అని స్పష్టంచేశారు.
► Read latest National - International News and Telugu News
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.