Corona Virus: కర్ణాటకలో డెల్టా ఏవై.4.2 కలకలం

బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనం కేసులను కర్ణాటకలో గుర్తించారు. పలువురి రక్త, ఇతర నమూనాలను రెండురోజుల కిందట పరీక్షలకు పంపగా.. బుధవారం ఆ వివరాలు వెల్లడయ్యాయి.

Updated : 28 Oct 2021 09:36 IST

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: బ్రిటన్‌, రష్యాల్లో ఆందోళనకరంగా విస్తరిస్తున్న కరోనా డెల్టా ప్లస్‌ ఉత్పరివర్తనం కేసులను కర్ణాటకలో గుర్తించారు. పలువురి రక్త, ఇతర నమూనాలను రెండురోజుల కిందట పరీక్షలకు పంపగా.. బుధవారం ఆ వివరాలు వెల్లడయ్యాయి. ఏకకాలంలో ఏడుగురికి ఈ వైరస్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ కేసుల్లో రెండింటికి ఏవై.4.2 లక్షణాలున్నట్లు ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ రణదీప్‌ వెల్లడించారు. ఏడుగురిలో ముగ్గురు బెంగళూరుకు చెందినవారు, నలుగురు ఇతర జిల్లాలవారు. ఈ వైరస్‌ వల్ల మరణాలేవీ సంభవించలేదు. కొత్త వైరస్‌ వ్యాప్తి సంకేతాల నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు విధించాలని సంబంధిత శాఖలకు రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీచేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని