Poison: ఈ ‘విషం’ చాలా కాస్ట్‌లీ గురూ!

అందమైన ఈ గాజు పాత్రను చూశారా! ఇందులో ఏ అమృతమో ఉండి ఉంటుందని.. దానిని వెంటనే సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా!!..

Updated : 25 Oct 2021 10:23 IST

అందమైన ఈ గాజు పాత్రను చూశారా! ఇందులో ఏ అమృతమో ఉండి ఉంటుందని.. దానిని వెంటనే సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారా!!.. ఆగండాగండి.. మీరనుకుంటున్నట్లు ఇందులో ఉన్నది అమృతం కాదు, పాము విషం. దాని విలువ రూ.12 కోట్లు. పశ్చిమబెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పుర్‌ జిల్లా కుమార్‌గంజ్‌ ప్రాంత వరి పొలాల్లో.. పాము విషం నింపిన పాత్రను సరిహద్దు భద్రతాదళ గస్తీ సిబ్బంది శనివారం రాత్రి గుర్తించారు. వెంటనే ఆ పాత్రను బలుర్‌ఘాట్‌ అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని