Covid Vaccine: అతి త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకా!

పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం తెలిపారు. ఈమేరకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడించారు.

Updated : 28 Jul 2021 12:52 IST

దిల్లీ: పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం తెలిపారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడించారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 18, అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. కాగా 12-18 ఏళ్ల వారికి జులై ఆఖరు లేదా ఆగస్టులో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావచ్చని ఇటీవల కొవిడ్‌-19 జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.ఆరోడా తెలిపిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని