AY.4.2: ‘ఏవై.4.2’ వేరియంట్‌తో ఆందోళన అక్కర్లేదు..!
ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే ప్రస్తుతానికి ఏవై.4.2 ప్రభావం చాలా తక్కువేనని.. కేవలం 0.1శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
వెల్లడించిన ఇన్సాకాగ్
దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో వైరస్ విజృంభణ మరోసారి మొదలయ్యింది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో మరోసారి వైరస్ ఉద్ధృతి పెరిగింది. ఇందుకు రూపాంతరం చెందిన కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో.. భారత్‌లో దీని ప్రభావం తక్కువేనని తాజాగా ఇక్కడి నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఆందోళనకర వేరియంట్లతో పోలిస్తే ప్రస్తుతానికి దీని ప్రభావం చాలా తక్కువేనని.. కేవలం 0.1శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు ‘ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG)’ వెల్లడించింది.
కొత్త వేరియంట్ల ఆనవాళ్లు లేవ్..
దేశంలో AY.4.2 వేరియంట్ వ్యాప్తి పెరుగుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇన్సాకాగ్ వెల్లడించింది. ఇప్పటివరకు వ్యాప్తిలో ఉన్న వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్ (VOI), వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)లతో పోలిస్తే దీని ప్రభావం 0.1శాతం కంటే తక్కువగా ఉందని.. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌తో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో డెల్టా (B.1.617.2) మాత్రమే ఆందోళనకర వేరియంట్‌గా కొనసాగుతోందని తెలిపింది. ఇవి కాకుండా దేశంలో కొత్తగా ఎటువంటి వేరియంట్లు వెలుగు చూడలేదని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది.
ఇక దేశంలో కొవిడ్ వైరస్ మరో ఉత్పరివర్తనం చెంది ప్రస్తుతం ‘ఏవై.4.2’ వేరియంట్ రూపంలో వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్ఫ్లుయెంజా డేటా (GISAID) వివరాల ప్రకారం.. భారత్‌లోనూ ఇప్పటివరకు దాదాపు 17 నమూనాల్లో ‘ఏవై 4.2’ వేరియంట్‌ను గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రాణాంతకం కాదని భావిస్తున్నారు. ఇదే సమయంలో కొవిడ్‌పై ఏర్పాటు చేసిన కన్సార్టియం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ.. ఏవై.4.2పై ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది.
ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్ జన్యు మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దేశవ్యాప్తంగా 28ల్యాబ్‌లతో కూడిన కన్సార్టియం ఏర్పడింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ కన్సార్టియంను డిసెంబర్ 2020లో ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
తమ దేశీయుల్ని రక్షించడంలో భారత నౌకాదళం ప్రదర్శించిన ధైర్యసాహసాలకు బల్గేరియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటికి ప్రధాని మోదీ(Modi) సమాధానం ఇచ్చారు. -
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. -
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. మహారాజ్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. -
దుస్తుల్లేని చిన్ననాటి ఫొటోపై అభ్యంతరం.. అకౌంట్‌ను నిలిపివేసిన గూగుల్
చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్లోడ్ చేసిన వ్యక్తికి గూగుల్ షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను నిలిపివేసింది. దీనిపై ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో బాధితుడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. -
ఎన్నికల బాండ్ల సమాచారమంతా వెల్లడించాల్సిందే
ఎన్నికల బాండ్ల అంశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసుకున్న సమాచారాన్ని మాత్రమే ఇవ్వాలన్న ధోరణిని బ్యాంక్ విడనాడాలని, మొత్తం వివరాలు ఈ నెల 21లోపు బహిర్గతం చేయాలని ఆదేశించింది. -
పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీతోపాటు 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తప్పించింది. వారితోపాటు రెండు రాష్ట్రాల్లో సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శులను బదిలీ చేసింది. -
ఆజం ఖాన్‌కు ఏడేళ్ల జైలుశిక్ష
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌కు స్థానిక కోర్డు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. 2016లో దుంగార్పుర్లో ఒక ఇంటిని బలవంతంగా కూల్చివేసిన కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘సామాజిక’ ప్రచారం
ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియకు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందులో భాగంగా వాట్సప్, సామాజిక మాధ్యమాలు, ఇన్ఫ్లుయెన్సర్లకు గిరాకీ పెరిగింది. -
వేడెక్కుతున్న ఉత్తర భారతం
ఉత్తర భారతంలో 1970 నుంచి శీతాకాలం క్రమంగా ఎండా కాలంగా మారిపోతోందని అమెరికన్ శాస్త్రజ్ఞుల బృందం క్లైమేట్ సెంట్రల్ హెచ్చరించింది. ఈ బృందం 1970 నుంచి డిసెంబరు-ఫిబ్రవరి కాలంలో ఉత్తర భారత్‌లో ఉష్ణోగ్రతల తీరుతెన్నులను విశ్లేషించింది. -
స్నేహమంటే అదే కదా.. నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ స్పందన
సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్‌పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. -
మమ్మల్ని దర్యాప్తు సంస్థలా మార్చకండి
గుజరాత్ యూనివర్సిటీలో గత వారాంతంలో విదేశీ విద్యార్థులపై చోటు చేసుకున్న దాడిని సుమోటోగా స్వీకరించాలంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తిరస్కరించింది. -
పోలీసు కాల్పుల్లో ఉపాధ్యాయుడి మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చిన్నపాటి ఘర్షణ కారణంగా హెడ్ కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో ఓ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సివిల్ లైన్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్స్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట
కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించి ఎమ్మెల్యే పదవికి అనర్హులైన ఆరుగురు రెబల్స్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించలేదు. -
వివక్షతో ఉద్యోగాలు నిరాకరించొద్దు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ట్రాన్స్జెండర్లపై వివక్ష ఉండకూడదని, వారికి సమాన అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
వ్యక్తిగత హోదాలోనే విరాళాలిచ్చాను
ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్.. ఏ పార్టీకీ ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలివ్వలేదని ఆ సంస్థ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సోమవారం వెల్లడించారు. -
ఈడీ సమన్లను లెక్కచేయని కేజ్రీవాల్
నగదు అక్రమ చలామణి కేసులో ప్రశ్నలకు జవాబివ్వడానికి సోమవారం రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెక్కచేయలేదు. -
సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపుటలవాట్లు
భారతీయుల ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగం, సరిపడా పొటాషియం లేకపోవడం వంటి ఆందోళనకర పోకడలు పెరుగుతున్నాయని తాజా పరిశోధన తేల్చింది. -
భారత నౌకాదళం భేష్: అమెరికా రక్షణ మంత్రి ప్రశంస
హిందూ మహాసాగరంలో సముద్రపు దొంగల ఆటకట్టించే ఆపరేషన్ల నిర్వహణలో భారత నౌకాదళ పాత్రను అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కొనియాడారు. శుక్రవారం భారత నౌకాదళం నడి సముద్రంలో సాహసోపేత ఆపరేషన్ నిర్వహించి.. -
సంక్షిప్త వార్తలు (5)
కబేళాలు, మాంసం ప్రాసెసింగ్ యూనిట్లను ‘పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)-2006’ పరిధిలోకి చేర్చాల్సిన అవసరం లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. -
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్‌క్రాఫ్ట్
భారత నేవీకి చెందిన రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ (RPA) కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ బేస్ వద్ద కూలిపోయింది. -
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం