
Novavax: నొవావాక్స్ టీకా వినియోగానికి WHO అనుమతి
జెనీవా: కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మరో టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో పచ్చజెండా ఊపింది. నొవావాక్స్ టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం ప్రకటించింది. అమెరికా సంస్థ నొవావాక్స్ తయారు చేసిన ఈ టీకాను భారత్‌లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అమెరికా సంస్థ నొవావాక్స్ తయారు చేసిన ఈ టీకాను భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ టీకా ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్-షేరింగ్ సిస్టమ్ కొవాక్స్లో భాగంగా పంపిణీ కానుంది.
‘కరోనా కొత్త వేరియంట్లు వెలువడుతుండటంతో తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి ప్రజలను రక్షించేందుకు టీకాలు అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటి. తక్కువ ఆదాయం గల దేశాల్లో మరింత మందికి టీకాలు ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది’ అని డబ్ల్యూహెచ్‌లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తక్కువ ఆదాయం గల 41 దేశాల్లో ఇప్పటికీ 10 మంది కూడా టీకాలు పొందలేకపోయారని, 98 దేశాలు 40 శాతం కూడా తీసుకోలేదని డబ్ల్యూహెచ్‌లో సీనియర్ అధికారిణి మరియాంజెలో సిమావ్ తెలిపారు. ఈ అనుమతితో ఆయా దేశాల్లో మరింత మంది టీకాలు పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
నొవావాక్స్ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిందని సీరమ్ గత నెల మొదట్లోనే వెల్లడించింది. నొవావాక్స్ రూపొందించిన NVX-CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు భిన్న సాంకేతికతతో నొవావాక్స్ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్రం కొద్దిరోజుల క్రితమే అనుమతి ఇచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Konda vishweshwar reddy: అందుకే భాజపాలో చేరుతున్నా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
Politics News
KTR: కేసీఆర్.. మోదీ పరిపాలనకు బేరీజు వేయండి: మంత్రి కేటీఆర్
-
Latestnews News
Ashada Masam 2022: ఆషాఢం వచ్చేసింది.. ఈ ‘శూన్య మాసం’ ప్రత్యేకతలివే..!
-
Business News
SBI down: దేశంలో స్తంభించిన ఎస్బీఐ సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!
-
Technology News
WhatsApp: వీడియోకాలింగ్కు వాట్సాప్ కొత్త ‘అవతార్’!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- PM Modi Tour: తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rocketry Preview: ప్రివ్యూ: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra: సీఎంగా ఫడణవీస్.. శిందేకు డిప్యూటీ సీఎం పదవి?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- గ్యాస్ట్రిక్ సమస్య.. ఏం తినాలి?