Delhi Shootout: కోర్టులో కాల్పుల ఘటనపై సీజేఐ విచారం

దిల్లీలోని రోహిణి ఆవరణలో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీజేఐ మాట్లాడారు...

Published : 24 Sep 2021 23:44 IST

దిల్లీ: దిల్లీలోని రోహిణి ఆవరణలో కాల్పుల ఘటనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీజేఐ మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పోలీసులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులతో మాట్లాడాలని సూచించారు. కోర్టుల భద్రత అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని అన్నారు. రోహిణి కోర్టులో కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై వచ్చే వారం ప్రాధాన్యం ఇస్తామని సీజేఐ జస్టిస్‌ ఎన్.వి.రమణ పేర్కొన్నారు.

దిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో ఓ గ్యాంగ్‌స్టర్‌ లక్ష్యంగా ప్రత్యర్థి గ్యాంగ్‌ శుక్రవారం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ జితేందర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని