Rape and murder cases: అత్యాచారాలు, హత్యలు ఆ ‘మహా’ నగరంలోనే ఎక్కువ..!

ఇటీవల కాలంలో హత్యాచార ఘటనలు దేశ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) పలు కీలక విషయాలు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల స్థానాల్ని బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది. 

Published : 17 Sep 2021 01:44 IST

వెల్లడించిన ప్రభుత్వ గణాంకాలు

దిల్లీ: ఇటీవల కాలంలో హత్యాచార ఘటనలు దేశ ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఈ సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) పలు కీలక విషయాలు వెల్లడించింది. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల్లో జరుగుతున్న నేరాలను బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది. 

కొవిడ్, లాక్‌డౌన్లతో సతమతమైన 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,533 అత్యాచార, 1,849 హత్య ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో దాదాపు 40 శాతం అత్యాచార, 25 శాతం హత్య కేసులు ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన 19 మహానగరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ లెక్కలను వెలువరించింది. హత్య కేసుల్లో తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, సూరత్ ఉన్నాయి. అయితే ముందు సంవత్సరంతో పోల్చితే నేరాల రేటు కాస్త తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది. 

ఇక దిల్లీలో 967 అత్యాచార ఘటనలు జరగ్గా.. జైపూర్, ముంబయి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యాచార బాధితుల్లో 2,448 మంది 18 ఏళ్లు పైడినవారు కాగా.. మిగిలిన వారు మైనర్లు. మరోపక్క దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 35,331. ముందు సంవత్సరంతో పోల్చితే 21.1 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. మగువలపై జరిగిన 30 శాతం నేరాలకు భర్త, అయినవాళ్లే కారణమయ్యారని ఆ నివేదిక పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని