Democracy Summit: ప్రజాస్వామ్య బలోపేతానికి భారత్‌ సిద్ధం: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు గాను.. అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.....

Published : 10 Dec 2021 23:05 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు గాను.. అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ప్రజాస్వామ్యంపై నిర్వహించిన వర్చువల్ సదస్సుకు హాజరైన ప్రధాని మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కృతనిశ్చయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య స్ఫూర్తి భారతీయుల్లో పాతుకుపోయిందన్నారు. ట్విటర్‌ వేదికగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు.

సున్నితత్వం, జవాబుదారీతనం, భాగస్వామ్యం, సంస్కరణల ధోరణిని భారత ప్రజాస్వామ్య పాలనకు నాలుగు స్తంభాలుగా ఉన్నాయని మోదీ తన ప్రసంగంలో వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామ్య దేశాలు తమ రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పాటించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ఇదే సమయంలో సాంకేతిక సంస్థలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని 12 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఆయా సంస్థలు సరైన దృక్పథంతో పనిచేయకుంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని