DGCA: అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగింపు..!

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆదివారం కీలక నిర్ణయం తీసుకొంది. షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీ పౌరవిమానాల

Published : 29 Aug 2021 23:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆదివారం కీలక నిర్ణయం తీసుకొంది. షెడ్యూల్‌ చేసిన అంతర్జాతీయ పౌరవిమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ షెడ్యూల్‌ విమానాలను మార్గాలను, పరిస్థితులను బట్టి అనుమతులు మంజూరు చేస్తారు. కార్గో విమానాలు, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేసిన మార్గాలకు ఈ నిషేధం వర్తించదు. 

‘‘26 జూన్‌ 2021 నాడు విడుదల చేసిన సర్క్యూలర్‌ గడువును సెప్టెంబర్‌ 30వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు పొడిగించారు. దీనిలో పేర్కొన్న అంతర్జాతీయ పౌర విమానాలకు ఇది వర్తిస్తుంది’’ అని డీజీసీఏ పేర్కొంది. ఈ నిబంధనలు అంతర్జాతీయ కార్గొ విమానాలకు వర్తించదని తెలిపింది. ఎంపిక చేసిన మార్గాల్లో షెడ్యూల్డ్‌ విమానాలను నడుపుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని