Corona Vaccine: కరోనా టీకాకు బదులు రేబిస్‌ ఇంజెక్షన్‌!

కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి యాంటీ-రేబిస్‌ ఇంజెక్షన్‌ చేశారు.

Published : 30 Sep 2021 12:26 IST

మహారాష్ట్రలో ఘటన

 

ఠాణె: కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన ఓ వ్యక్తికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి యాంటీ-రేబిస్‌ ఇంజెక్షన్‌ చేశారు. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. రాజ్‌కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి కరోనా టీకా పొందేందుకు సోమవారం కాల్వా ప్రాంతీయ వైద్య కేంద్రానికి వెళ్లాడు. అక్కడ కరోనా టీకాల వరుసకు బదులు వేరే వరుసలో నిల్చొని ఇంజెక్షన్‌ తీసుకున్నాడు. రేబిస్‌ ఇంజెక్షన్‌ చేసినట్లు వైద్య సిబ్బంది చెప్పడంతో బాధితుడు లబోదిబోమంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అతడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన ఉన్నతాధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. వైద్య కేంద్రం బాధ్యులు అయిన మహిళా వైద్యురాలు, నర్సును సస్పెండ్‌ చేశారు. విషయం తెలియగానే రాజ్‌కుమార్‌ విపరీతంగా భయపడ్డారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఠాణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికార ప్రతినిధి విలేకరులకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని