వైద్య వృత్తిపై అపార విశ్వాసం.. అపనమ్మకం ఎవరిపైనో తెలుసా..?

ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంటికి దూరంగా ఉంటూ వైద్యులు అందించిన సేవలు అందరిని కదిలించాయి.

Published : 31 Dec 2021 17:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇంటికి దూరంగా ఉంటూ వైద్యులు అందించిన సేవలు అందరినీ కదిలించాయి. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లతో సవాలు విసురుతోన్న కొవిడ్‌ వైరస్‌తో వైద్యసిబ్బంది ఎంతగానో అలసిపోయారు. అయినాసరే తమ అంకితభావాన్ని ప్రదర్శించారు. ఇదే వైద్య వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని ఎన్నో రెట్లు పెంచింది. తాజాగా మార్కెట్ రిసెర్చ్‌ కంపెనీ ఇప్సో నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం వెల్లడైంది. గ్లోబల్ ట్రస్ట్‌వర్తీనెస్ ఇండెక్స్‌లో వైద్య వృత్తి ముందువరుసలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 28 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 64 శాతం మంది ఈ వృత్తి అత్యంత విశ్వసనీయమైనది పేర్కొన్నారు. 

వైద్యుల తర్వాత స్థానంలో శాస్త్రవేత్తలు(61 శాతం), అధ్యాపకులు(55 శాతం) నిలిచారు. సర్వేలో పాల్గొన్నవారు రాజకీయ నాయకులపై అపనమ్మకాన్ని వ్యక్తం చేశారు. 10శాతం మందే వారికి అనుకూలంగా స్పందించారు. ప్రభుత్వ మంత్రులను 14 శాతం, ప్రకటనల ఎగ్జిక్యూటివ్‌లను 15 శాతం మంది మాత్రమే నమ్మారు.

బ్రిటన్ వాసులు వైద్యులపై అత్యంత నమ్మకాన్ని ప్రదర్శించారు. 72 శాతం మంది వారికి అనుకూలంగా ఓటేశారు. తర్వాత నెదర్లాండ్‌(71), కెనడా(70) ప్రజలు వారిపై అపార నమ్మకాన్ని చాటారు. 2019 నుంచి 2021లో హంగేరీ, చిలీలో ఈ రేటింగ్ 19 శాతం పెరిగింది. దక్షిణకొరియా, జపాన్‌ వాసుల్లో మాత్రం వైద్యులపై అంత నమ్మకం కనిపించలేదని ఆ సర్వే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని