Trump: లైంగిక ఆరోపణలపై ట్రంప్‌ ఎదురుదావా

తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఒక మహిళపై ఎదురు దావా వేయడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. 2006లో ట్రంప్‌ సమర్పించిన ఓ టీవీ

Published : 21 Oct 2021 08:04 IST

వాషింగ్టన్‌: తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఒక మహిళపై ఎదురు దావా వేయడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధమవుతున్నారు. 2006లో ట్రంప్‌ సమర్పించిన ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళ ఆయనపై 2016లో పలు ఆరోపణలు చేశారు. 2007లో తాను వృత్తిరీత్యా ట్రంప్‌ను న్యూయార్క్‌లోని ఆయన కార్యాలయంలో, కాలిఫోర్నియాలో ఆయన బస చేసిన హోటల్‌లో కలిశానని ఆమె చెప్పారు. ఆ రెండు సందర్భాల్లో ట్రంప్‌ తనను బలవంతంగా ముద్దాడటానికి ప్రయత్నించారనీ, అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీనిపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా నిరోధించడానికి ఇంకా అనేకమంది మహిళలు అబద్ధాలను ప్రచారం చేశారని ప్రకటించారు. పిటిషన్‌పై డిసెంబరు 23న విచారణ జరగనుంది. కేసు కీలక దశకు చేరిన తరుణంలో ట్రంప్‌ న్యాయవాదులు ఆ మహిళపై ఎదురు దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు. ఇలాంటి దావాలను వీగిపోయేటట్లు చేయడానికి తోడ్పడే చట్టాన్ని 2020లో తీసుకొచ్చారు. ట్రంప్‌ ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం కుదరదని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

* అధ్యక్ష పదవిని ట్రంప్‌ దుర్వినియోగం చేశారనీ, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత అధికారం శాంతియుతంగా చేతులు మారకుండా అడ్డుపడ్డారనీ ఎక్కువమంది పౌరులు భావిస్తున్నట్లు అధ్యక్ష భవన పత్రికా వ్యవహారాల కార్యదర్శి జెన్‌ సాకీ చెప్పారు. ట్రంప్‌ చర్యలు అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని