Covid vaccines: కరోనా, వ్యాక్సిన్లపై రాజకీయాలు చేయొద్దు..!
దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ సమస్యలపై ఎటువంటి రాజకీయం చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్, వ్యాక్సిన్ సమస్యలపై ఎటువంటి రాజకీయం చేయొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించే బృహత్తర కార్యక్రమంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉందని.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
కొవిడ్-19 సమస్యలు, వ్యాక్సిన్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రులతో 20సార్లు భేటీ అయిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గుర్తుచేశారు. ఆరోగ్యం విషయం రాష్ట్రాలకు సంబంధించిందని కొన్ని రాష్ట్రాలు గుర్తుచేసిన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అయినప్పటికీ దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగానే పంపిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష పార్టీలకు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ నాటికి 135 కోట్ల డోసులు..
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంలో ఎటువంటి ఆలస్యం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు-డిసెంబర్ నాటికి దాదాపు 135కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నట్లు అంచనా వేసింది. అయితే, ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ఎప్పుడు ముగుస్తుందనడానికి ఎటువంటి కచ్చితమైన సమయం లేదని.. డిసెంబర్ చివరినాటికి 18ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ అందుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
వ్యాక్సిన్ల కోసం రూ.9725కోట్ల ఖర్చు..
ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్‌లో కొనసాగుతోందని.. ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకు రూ.9,725కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ సేకరణతో పాటు ఈ కార్యక్రమ నిర్వహణ కోసం వీటిని ఖర్చు పెట్టామని తెలిపింది. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 42కోట్ల డోసులను పంపిణీ చేయగా.. నిన్న ఒక్కరోజే 54లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ (C-Vigil) యాప్ ద్వారా 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
లోక్‌సభ ఎంపీల్లో 44శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ వెల్లడించింది. 5శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని, వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది. -
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
Fake Calls: టెలికాం శాఖ పేరుతో మీకు కాల్స్ వస్తున్నాయా?ఫోన్ నంబరు డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. -
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమను ఆర్థికంగా కుంగదీసేందుకు భాజపా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించింది. -
కేజ్రీవాల్ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
Sunita Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన సతీమణి సునీత వాట్సప్ ప్రచారాన్ని ప్రారంభించారు. -
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
Arvind Kejriwal: కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫోన్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలను తెలుసుకునేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి ఆతిశీ ఆరోపించారు. -
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
Mukhtar Ansari: గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ మృతితో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించలేదని ఆరోపిస్తున్నారు. -
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1800 కోట్ల పన్ను నోటీసులు
Congress: కాంగ్రెస్‌కు ఆదాయపు పన్ను విభాగం రూ.1800 కోట్లకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
Modi-Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. డిజిటల్ విప్లవం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్‌నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్‌ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన 58 ఏళ్ల దేవ్‌కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్