FEMA probe: బ్యాంకు మాజీ ఛైర్మన్​పై ఈడీ కొరడా.. రూ. 294కోట్ల ఆస్తులు జప్తు

తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్​ నేసమణిమారన్​ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్​ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది......

Published : 28 Dec 2021 20:53 IST

దిల్లీ: తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్​ నేసమణిమారన్​ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్​ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద మారన్​కు చెందిన రూ.293.91 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తులు.. నాలుగు భారతీయ కంపెనీలైన సదరన్ అగ్రిఫ్యూరేన్​ ఇండస్ట్రీస్​ ప్రైవేట్ లిమిటెడ్, ఆనంద్ ట్రాన్స్​పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్​, ఎంజీఎమ్​ ఎంటర్​టైన్​మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్, ఎంజీఎం డైమండ్ బీచ్ రీసార్ట్​ ప్రైవేట్ లిమిటెడ్​లో షేర్ల రూపంలో ఉన్నాయని తెలిపారు.

2005-06, 2006-07 ఆర్థిక సంవత్సరంలో సింగపుర్​లోని సంస్థల్లో రూ.293.91 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్​బీఐ అనుమతి లేకుండా ఈ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించింది. ‘ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోకుండానే మారన్‌ ఈ పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో ఇంత భారీ పెట్టుబడులు పెట్టిన విషయాన్ని భారత నియంత్రణ సంస్థలకు వెల్లడించలేదు’ అని ఈడీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని