Published : 01/11/2021 23:56 IST

SC Judge: విద్యారంగంలో వెనుకబడిపోయాం.. నాణ్యమైన విద్య ఇవ్వాల్సిందే!

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌

దిల్లీ: సుస్థిరాభివృద్ధి సాధనలో భాగంగా విద్యారంగంలో భారత్‌ ఇంకా వెనుకబడే ఉందని.. అందుకే సమగ్ర విద్యా లక్ష్యాన్ని సాధించలేకపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి చిన్నారికి మంచి, నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. ప్రజల్లో న్యాయసేవలపై అవగాహన కల్పించేందుకు జాతీయ న్యాయసేవల సంస్థ (NALSA) గుజరాత్‌లోని భుజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ యు.యు లలిత్‌ ఈ విధంగా మాట్లాడారు.

‘కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిమ్స్‌, ఐఐటీలు, ఎన్‌ఐటీ, జాతీయ లా కళాశాలలు వంటివి ఆయా రంగాల్లో విశేష ప్రగతి సాధించాయి. కానీ, దేశంలోని ప్రైమరీ, సెకండరీ స్కూళ్ల విషయంలో మాత్రం వెనుకబడిపోయాయి. మన విద్యా విధానం సమగ్రంగా లేదు. నాణ్యతలో గ్రామీణ ప్రాంతాలు, పెద్ద నగరాల్లో అందిస్తోన్న విద్యకు పెద్ద తేడా లేదు. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాలి. సుస్థిరాభివృద్ధి ప్రమాణాల ప్రకారం.. విద్యారంగంలో వెనుకబడే ఉన్నాం. విద్యాహక్కు చట్టం (RTE) అమల్లోకి వచ్చి 11ఏళ్లు కావొస్తోంది. ప్రాథమిక, సెకండరీ స్కూళ్లలో బాలికల భాగస్వామ్యం పెరిగింది. అయినప్పటికీ విద్య ఒక్కటే సరిపోదు. సమగ్ర విద్య అందించే దిశగా కృషి జరగాలి’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ పేర్కొన్నారు. విద్యారంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించకుంటే పేదరికాన్ని నిర్మూలించలేమన్నారు.

న్యాయసేవలపై మాట్లాడిన జస్టిస్‌ యు.యు లలిత్‌.. న్యాయస్థానాలకు వచ్చే ప్రతి వంద మందిలో కేవలం ఒక్కరు మాత్రమే న్యాయసేవా సంస్థల ప్రయోజనాలను పొందుతున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలతో పాటు మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు న్యాయసేవల సంస్థ కృషి చేస్తుందన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని